SP Ashok Kumar : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

by Aamani |
SP Ashok Kumar : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి
X

దిశ, గొల్లపల్లి : ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.వార్షిక తనిఖీ లో భాగంగా బుధవారం గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ లో అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉండడంతో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు దూరంగా ఉన్నప్పటికీ పెట్రోల్ కార్, బ్లూ కోట్ సిబ్బంది 10 నిమిషాల్లో చేరుకుని సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా పెండింగ్ లో ఉన్న కేసులపై రివ్యూ చేసిన ఎస్పీ, ప్రజలకు మరింత చేరువ అయ్యేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, ధర్మపురి సీఐ రామ్ నరసింహ రెడ్డి, డీ సీ ర్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు సతీష్, ఉమా సాగర్, శ్రీధర్ రెడ్డి, మహేశ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story