- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ద రాత్రి టిప్పర్ లారీ విధ్వంసం.. అంధకారంలో పలు గ్రామాలు
దిశ, పెగడపల్లి: అర్ధరాత్రి అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ చేసిన విధ్వంసంతో పలు గ్రామాలు అంధకారంలో మునిగాయి. మండలంలోని ఆరవెల్లి గ్రామం నుండి బతికే పెళ్లి మీదుగా అతివేగంతో వెళ్తున్న టిప్పర్ 33 కే వి వైర్లను వందల మీటర్ల దూరంతో లాక్కెళ్ళింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. టిప్పర్ లారీ విధ్వంసానికి బతికేపల్లి సబ్ స్టేషన్‌లోని ఇన్సిలేటర్లు, కరెంట్ స్తంభాలతో పాటు ఇతర ముఖ్యమైన పరికరాలు దెబ్బతిన్నాయి.
ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ వద్దకు రాగ పోలీస్ సిబ్బంది వెంకటేష్ వారిని సముదాయించి శాంతింపజేశారు. అయితే ఇంతటి విధ్వంసం చేసిన టిప్పర్ ప్రముఖ కంపెనీకి చెందిన వారిధిగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని రోడ్డుమీద వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటన మీద విద్యుత్ ఏడి ని వివరణ కోరగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్టు ప్రమాదానికి కారణమైన టిప్పర్ వల్ల నష్ట పోయిన వివరాలు సేకరించి పోలీస్‌లకు పిర్యాదు చేస్తామని విద్యుత్ ఏడి తెలిపారు.