Incessant rains : వరుణుడు ఇకనైనా కరుణించేనా..!

by Sumithra |
Incessant rains : వరుణుడు ఇకనైనా కరుణించేనా..!
X

దిశ, పెద్దపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముసురు కమ్ముకొస్తుంది. దీంతో పెద్దపల్లి, రామగుండం, కమన్ పూర్, జూలపల్లి, ముత్తారం, ఓదెల పలు మండలాల్లో చెరువులు మత్తల్లు దిగుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల పంట పొలాలు నీటమునిగాయి. మంథని, మైదుపల్లి, బిట్టుపల్లి, ధర్మారం, పలు శివారులలోని చెరువులు, వాగులు, వంకల నుండి నీటి ప్రవాహం అధికంగా రావడంతో పంట పొలాల నుండి నీళ్ల ప్రవాహం వెళుతుంది. దీంతో వేసిన పత్తి మొక్కలు జాలు వారి దెబ్బతింటున్నాయి. పొలాల్లో ఖరదా చల్లి, నారు వేసి నాట్లు వేశారు.

పై నుండి వచ్చే వరద ప్రవాహంతో పొలాలు మునిగిపోయి మురుగుతుంది. పంట పొలాలు నీట మునగటంతో పెట్టిన పెట్టుబడి అంత నీళ్ల పాలు అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూగజీవాలు సైతం ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సతమతం అవుతున్నాయి. జన జీవాలకు అస్తవ్యస్తంగా మారింది. జోరు వానలతో కొన్నిచోట్ల గ్రామాల్లో రోడ్ల మీద నుండే నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ఇంకా నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికె తెలిపింది. దీంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.వరుణ దేవుడు ఇప్పటికైనా కనికరించాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story