రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

by Sumithra |
రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో సోమవారం కథలాపూర్ మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తాండ్రియాల పరిధిలో గల ఊర చెరువులో 30,800 చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని, రైతు సంబంధం ఉన్న ప్రతి కార్యక్రమంలో ప్రత్యేక చొరవతో ముందుకు పోతున్న అంశాల్లో చెరువులు, ప్రాజెక్టులు ఉంటే మత్సకారుల ఆదాయంను రెట్టింపు చేసే అవకాశం ఉన్నదని అన్నారు. దానిలో భాగంగా ప్రభుత్వం చేపట్టే మొదటి ప్రాధాన్యత కల్గిన 9 నీటిపారుదల ప్రాజెక్టుల్లో భాగంగా కలికోట సూరమ్మ పేరును చేర్చి ఈ ప్రాంతంలోని రైతుల స్వప్నం సాకారం చేయాలన్నదే నా లక్ష్యం అన్నారు.

అలాగే జిల్లా మత్సశాఖ అధికారిణి విజయభారతి చెప్పినట్లు 261 మత్స సహకార సంఘాల ఆధ్వర్యంలో తాండ్రియాల గ్రామ ఊర చెరువులో 30,800 ల చేప పిల్లలను పంపిణిలో భాగంగా మూడు రకాలతో కూడిన చేప పిల్లలను పంపిణీ చేశారని తెలిపారు. ఈ చేపల పెంపకం పట్ల గ్రామ మత్సకారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ పి విజయభారతి, ఎంపీడీఓ శంకర్, ఏ ఓ కే. యోగిత, సమైక్య సంఘాల అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్,సొసైటీ అధ్యక్షులు దేశమేని ధర్మేందర్, జిల్లా పీసీసీ కార్య వర్గ సభ్యులు తోట్ల అంజయ్య, అధ్యక్షులు కాయితీ నాగరాజు, బ్లాక్ అధ్యక్షులు ఎండి. అజీమ్, జిల్లా ఫిషరీష్మెన్ కార్యదర్శి కల్లెడ గంగాధర్,మాజీ సర్పంచ్ గంగా ప్రసాద్, ఊర్మల్ల చారీ,ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ మత్సశాఖ సంఘ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story