- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే.. ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బాలకిషన్
దిశ, శంకరపట్నం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే.. లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిధులు విడుదల చేస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి భూమి పూజ, గ్రామంలోని వాలీ, సుగ్రీవ ఆలయంలో సీతారాముల కళ్యాణానికి హాజరై, కేశవపట్నం, మొలంగూర్ లో వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అంబాలాపూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మి మల్లయ్య కుమార్తె వివాహానికి హాజరై రూ.50 వేల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టి దేశమే రాష్ట్రం వైపు చూసేలా చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తృతం చేసి, ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, పేద కుటుంబాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిధులు విడుదల చేస్తూ అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటీసీలు లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచ్ లు కాటం వెంకట రమణారెడ్డి, రవి, రాజయ్య, భద్రయ్య, రంజిత్ రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: బీఆర్ఎస్‌లో భేదాభిప్రాయాలు ఉంటే కూర్చుని సమస్యలను పరిష్కరించుకొండి : మాజీ మంత్రి తుమ్మల