- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS Corporator : బీఆర్ఎస్ కార్పోరేటర్ ఫంక్షన్ హాల్ కూల్చివేత..
దిశ, గోదావరిఖని టౌన్ : బీఆర్ఎస్ రామగుండం కార్పొరేటర్ పెంట రాజేష్ ఫంక్షన్ హాల్ను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. పారిశ్రామిక ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన, ఆక్రమించుకున్న వాటిని కూల్చివేస్తామని అధికారులు తెలిపారు. మంగళవారం అడ్డగుంటపల్లిలోని సిరి ఫంక్షన్ హాల్ను మున్సిపల్ అధికారులు రెండు జేసీబీలతో నేలమట్టం చేశారు.
నాలా పై సిరి ఫంక్షన్ హాల్ను నిర్మించారని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఫంక్షన్ హాల్ యాజమాన్యం స్పందించలేదని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చి వేస్తున్నామని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ప్రతిపక్ష నాయకుని ఫంక్షన్ హాల్ కూల్చి వేస్తున్నారని సమాచారం పారిశ్రామిక ప్రాంతంలో వ్యాపించటంతో అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.