ఎవరికి న్యాయం జరిగిందని దశాబ్ధి సంబురాలు : మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

by Shiva |
ఎవరికి న్యాయం జరిగిందని దశాబ్ధి సంబురాలు :  మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి
X

దిశ, సైదాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరిగిందని దశాబ్ధి సంబురాలు జరుపుతున్నారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పల్లేపల్లెకు ప్రవీణన్న కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలం ఏక్లాస్ పూర్ లో ప్రవీణ్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మదేళ్లయినా.. తెలంగాణ ప్రజానీకానికి సంతోషం మిగలలేదన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అని మాయ మాటలు చెప్పి, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతన్న తీవ్ర సమస్యల్లో ఉన్నాడని అన్నారు. రైతులను ఆదుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్ట పోయిన రైతులను పరామర్శించడం తప్ప, ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ, పనిముట్లపై సబ్సిడీ ఇవ్వకుండా రైతులకు తీవ్ర నష్టం చేస్తుందన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని అన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు, ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పించన్ రూ.5 వేలు ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని తెలిపారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని పేర్కొన్నారు.

భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల సాయం, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు రూ.12 వేల సాయం అందిస్తామని ప్రవీణ్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోవాలని కోరారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉసకోయిల రాఘవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి కిష్టయ్య, డీసీసీ అధికార ప్రతినిధి మ్యాకల రవీందర్, మాజీ మండలాధ్యక్షులు రవీందర్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్ కుమార్, ఎలిబోతారం ఎంపీటీసీ చాంద్ పాషా, ఎంసీటీసీ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ పరకాల రమేష్ , నాయకులు సారబుడ్ల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జున్నుతుల రాజేందర్ రెడ్డి, దొంత సుధాకర్, కొండాల్ రెడ్డి, అనగొని శ్రీనివాస్, మారుపాక రాజు, మీసా బిరయ్య, క్రాంతి కుమార్, గాజర్ల రమేష్, చోటే మియా, దస్త గిరి, శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు, చల్లూరి రవీందర్, దాసరి సందీప్, నర్సింగోజు లక్ష్మినారాయణ, అంబాల్ నగేష్ , శ్రీను, చోటా, సల్మాన్, తీగల రఘుపతి, అకుబట్టిని శ్రీనివాస్, తీగల రాజ్ కుమార్, హరీష్, లక్ష్మి కాంత్, అసరి మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed