power plant : విద్యుత్ సౌదం పెట్టారు.. కంచె నిర్మాణం మరిచారు..

by Sumithra |   ( Updated:2024-10-27 09:33:18.0  )
power plant : విద్యుత్ సౌదం పెట్టారు.. కంచె నిర్మాణం మరిచారు..
X

దిశ, రామడుగు : ప్రజల వద్ద వసూలు చేస్తున్న పన్నులకు అనుగుణంగా పని చేయవలసిన సంబంధిత శాఖ అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా పనులు చేస్తూ చేతులు దులుపుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే రామడుగు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ సౌధాన్ని చుట్టూ కంచె ఏర్పాటు చేయకుండానే వదిలేయడంతో ఆ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులు, పిల్లలు అక్కడే తిరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం పై విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న విద్యుత్ సౌధం చుట్టూ కంచె ఏర్పాటు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ యంత్రాంగం పట్టించుకోని ప్రమాదం జరగక ముందే కంచ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story