- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
దిశ, వేములవాడ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీకమాస పర్వదినాలతో పాటు సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించారు. అనంతరం కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
12వ తేదీన అనుగ్రహ భాషణ కార్యక్రమం
రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు రాజన్న ఆలయంలో కొనసాగుతున్న కార్తీకమాస వేడుకల్లో భాగంగా ఈనెల 12వ తేదీన శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి తోగుట పీఠాధిపతులతో అనుగ్రహ భాషణ, పుష్పార్చన, గోపూజ నిర్వహించనున్నట్లు ఆలయ ఈ.ఓ వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.