రామగుండంలో ఆంక్షలు కొనసాగింపు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ

by Disha News Web Desk |
రామగుండంలో ఆంక్షలు కొనసాగింపు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ
X

దిశ, గోదావరిఖని టౌన్: మహిళల సమస్యలు దృష్టిలో పెట్టుకొని రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా నిషేధాజ్ఞలు కొనసాగించాలని సీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ.. ప్రజలను అసభ్య పదజాలంతో దూషించడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ప్రజల భద్రత కోసం నిషేధాజ్ఞలు కొనసాగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అలాగే డీజే సౌండ్‌ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలూ పొడిగించినట్లు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఆరోగ్యం, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ధ కాలుష్యం నుంచి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సమావేశాల దృష్ట్యా మైక్‌సెట్ తప్పనిసరి అయితే సంబంధిత డివిజన్ ఏసీపీల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ నిషేధాజ్ఞలు ఫిబ్రవరి 28వ తేదీ వరకూ కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed