- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి పనులు జరగడం లేదంటూ కార్పొరేటర్ వినూత్న నిరసన
దిశ, గోదావరి ఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ కార్పొరేటర్ ఐత శివకుమార్ రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ఎండలో మోకాళ్ల మీద కూర్చొని సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. డివిజన్ లో అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు వృథాగా పోయే అవకాశం ఉందన్నారు. పనులు చేయాల్సిన కాంట్రాక్టర్లు సంవత్సరాల నుంచి ముందుకు రావడం లేదని, స్పందించాల్సిన కార్పొరేషన్ అధికారులు విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
మరో రెండు, మూడు రోజుల్లో 32 డివిజన్ లో పనులు ప్రారంభం కాకపోతే.. డివిజన్ ప్రజలంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చిరించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలతో సతమతమవుతున్నా.. అధికార పార్టీలో ఉన్నప్పటికీ.. నిరసన తెలుపక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. అధికారులు స్పందించి పనులు ప్రారంభించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ శివకుమార్ కోరుతున్నారు.