- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర మరువలేనిది'
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: రాజ్యాంగ నిర్మాణంలో డా.బి ఆర్ అంబేద్కర్ పాత్ర మరువలేనిదని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర అన్నారు. శనివారం ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లిలో భారతరత్న బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ భారత దేశానికి రాజ్యాంగము ఆమోదం ద్వారా దేశ ప్రజలకు రాజాకీయ, పరిపాలన పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని, స్వాతంత్ర్యానికి పూర్వం దేశ ప్రజలకు వలస పాలకుల, రాజరికపు పాలకుల పాలనలో కేవలం పాలకులు చెప్పిందే అమలు అయ్యేదని భారత రాజ్యంగము ఆమోదం ద్వారా దేశ కోట్లాది మంది ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు హక్కుగా పొందే అవకాశంతో పాటు అనేక పరిపాలన, రాజకీయ, సామాజిక, ఆర్ధిక హక్కులు ప్రజలకు భారత రాజ్యాంగము ఆమోదం ద్వారా రాజ్యాంగ నిర్మాతలు దేశ ప్రజలకు కల్పించారన్నారు. భారత రాజ్యాంగము నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర మరువలలేనిదని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి శ్రీకాంత్, గడ్డం పాండు రంగం, కార్యవర్గ సభ్యులు సాయి వరాల తదితరులు పాల్గొన్నారు.