- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాపీ బర్త్డే రవన్న..చర్చగా మారిన కాంగ్రెస్ యువనేత హోర్డింగ్..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మూడు రోజుల క్రితం కాంగ్రెస్ యువనేత, హైకోర్టు న్యాయవాది బుర్ర రవితేజ గౌడ్ హోర్డింగ్ వెలిసింది. మొన్న 26న ఆయన జన్మదినం సందర్భంగా హ్యాపీ బర్త్డే రవన్న అంటూ హోర్డింగ్ కు రవితేజ అనుచరులు ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. అయితే గతంలో రవితేజ పేరు గట్టిగానే వినిపించిన గత కొన్ని రోజుల క్రితం వరకు మరుగున పడింది. కాగా ఈ యువనేత విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతూ రాష్ట్రస్థాయి నేతగా ఎదిగాడు. ప్రస్తుతం ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నాడు. కాగా మూడు రోజుల క్రితం సిరిసిల్లలో వెలిసిన ఫ్లెక్సీ తో జిల్లాలోని అన్ని పార్టీల నేతల చూపు మొత్తం రవితేజ వైపు మళ్ళింది. గత మూడు రోజులుగా ఎవరు ఈ రవితేజ అన్న చర్చ జిల్లా కేంద్రంలో పెద్ద చర్చనీయాంశమైంది.
ఎవరు ఈ రవితేజ..?
జిల్లాలోని కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన బుర్ర రవితేజ గౌడ్ తన విద్యార్థి దశ నుండే రాజకీయాలపై అవగాహన పెంచుకున్నాడు. తొమ్మిదో తరగతి లోనే ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయాలని, సిరిసిల్లలోని అంబేద్కర్ వద్ద రాస్తారోకో చేసి, మంచి విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 నుంచి 2013 వరకు కేయూ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం జేఏసీ ప్రెసిడెంట్ కొనసాగి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం జేఎన్టీయూ ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా కొంతకాలం కొనసాగాడు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రజలకు అందుబాటులో ఉండకుండా విదేశాల్లో ఉంటున్నాడని, నియోజకవర్గ అభివృద్ధిపై గొంతెత్తి ప్రశ్నిస్తూ వార్తల్లోకి ఎక్కాడు. రమేష్ బాబు పౌరసత్వ వివాదంపై కూడా వీరోచిత పోరాటం చేశాడు.
వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ..
2018 శాసనసభ ఎన్నికల్లో యువనేత రవితేజ గౌడ్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ, 587 ఓట్లు సాధించి వేములవాడ చరిత్రలో కొన్ని పేజీలను నిలుపుకున్నాడు. అనంతరం నిరుద్యోగులకు ఉద్యోగులకు నోటిఫికేషన్లు వేయాలని, అలాగే నిరుద్యోగుల సమస్యలపై కలియుగ పాండవులు మాదిరి పోరాడుతామని రవితేజ తో పాటు మరో నలుగురు యువకులు మెదక్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రాష్ట్రం మొత్తం రవితేజ వైపు చూసింది. తరువాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎల్ఎల్బీ పూర్తి చేసి హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ కొనసాగించాడు.
కాంగ్రెస్ పార్టీలో చేరిక..
పేద ప్రజలందరికీ కూడు,గుడు, గుడ్డ మౌలిక వసతులు కల్పించాలని తాను నమ్మిన సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట నడవాలని ఆకాంక్షతో 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వెనువెంటనే 2022లో టిపిసిసి స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ గా నియమించబడి ఇటీవల టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూడా నియమించబడ్డాడు. ప్రజల్లో పేద, ధనిక వ్యత్యాసాలకు తావివ్వకుండా అందరికీ సమాన న్యాయం చేయడమే తన సిద్ధాంతమని చెప్పుతూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ తాజాగా సిరిసిల్ల లో వెలసిన హోర్డింగ్ కొంత రాజకీయ చర్చకు దారితీసింది. ప్రజా సమస్యలపై పోరాడే యువనేత రవితేజకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని పలువురు అంటున్నారు. ఈ తరం రాజకీయాలకు ఆయన లాంటి నాయకుడు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.