- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ గ్యారెంటీ లేని పార్టీ : సంజయ్ కుమార్
దిశ, జగిత్యాల టౌన్ : ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేయడానికి చూస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. పట్టణంలోని మోతే రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ అసలు ఏ గ్యారెంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ కే కాదు వాళ్ళ పథకాలకు కూడా గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు. ఆడపిల్లల పెళ్ళి కాడికి వచ్చి తిని పో యండ్రు కానీ ఈసమెత్తు సాయం చేసినోళ్లు లేరు నేడు తులం బంగారం ఎలా ఇస్తారని విమర్శించారు.
కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 1000 రూపాయలకు మించి పెన్షన్లను ఇవ్వడం లేదని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆసరా పింఛను ఇప్పటికీ 3000 ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని అసత్యలు ప్రచారం చేసిన గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బాలం ముకుందం, దావ సురేష్, ఎంపీటీసీ సౌజన్య, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.