- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Collector Jitesh V. Patil : రైతు రుణమాఫీ పై అన్ని మండలాల్లో ప్రజావాణి
దిశ, కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా 12-12-2018 నుంచి ఆగస్టు 15 2024 వరకు రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారిలో రుణమాఫీ కానీ వారు దరఖాస్తు చేసుకోవాలని, జిల్లాలోని 23 మండలాల్లో వ్యవసాయ అధికారులు (A.O)మంగళవారం (20-08-2024) నుండి 30-08- 2024 వరకు రైతు రుణమాఫీ పై ప్రజావాణి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రైతు రుణమాఫీ కానీ రైతులందరూ తమ తమ మండలాల్లోని వ్యవసాయ అధికారులను (A.O) కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి అని తెలిపారు. జిల్లాలోని అర్హత కలిగిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చెల్లిస్తుందని. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం రైతులకు కల్పించిన ఈ సదావకాశాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగపరుచుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ దరఖాస్తులను వ్యవసాయ శాఖ సంబంధిత పోర్టల్ లో ఆన్లైన్ చేస్తామని అన్నారు . జిల్లాలోని 23 మండలాల వ్యవసాయ అధికారుల అందుబాటులో ఉంటారని తెలిపారు.