- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఉద్యమాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ : ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తెలంగాణ ఉద్యమాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. శుక్రవారం వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలోని మలిదశ ఉద్యమకారిణి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమకారులు చిట్యాల ఐలమ్మ, రావి నారాయణ రెడ్డి, దొడ్డి కొమురయ్య గురించి చేన్నమనేని రాజేశ్వరరావు తన పుస్తకంలో రాశారని గుర్తు చేశారు.
వారి ఉద్యమ అడుగుజాడల్లోనే చెన్నమేని రాజేశ్వరరావు నడిచారని అప్పుడున్న పరిస్థితుల్లో తుపాకీ పట్టి కోనరావుపేట మండలంలో తన తొలి దశ ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు. ఆనాడు భూస్వామ్య వ్యవస్థపై పోరాటం చేసిన వ్యక్తి చెన్నమనేని రాజేశ్వరరావు అని గుర్తు చేశారు. దోపిడి, వెట్టి చాకిరీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన వీరనారి ఐలమ్మ గురించి పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో ఎల్లంపల్లి పూర్తి చేసుకున్నామని, దాంతో దాదాపు 55 వేల ఎకరాలకు సాగునీరు అందించుకున్నామని తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ కొన్ని రోజుల్లో పూర్తి కాబోతోందని అన్నారు. తద్వారా ఆ ప్రాంతంలో 9 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్రం మొత్తంలో రూ.65 వేల కోట్ల రూపాయలు రైతుబంధు కింద రైతులకు సహాయం అందిస్తుందని తెలిపారు.
అకాల వర్షాల కారణంగా సన్న, చిన్నకారు రైతులకు నష్టం వాటిల్లిందని అందుకే సీఎం కేసీఆర్ తక్షణ సాయం కింద ఏకరానికి రూ.10 వేలు సాయం అందిస్తున్నారని.. రైతులు అధైర్య పడొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ యేష వాణి, సెస్ డైరక్టర్ ఆకుల దేవరాజం, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు దుబ్బాక రమేష్, జిల్లా రజక సంఘము కార్యదర్శి దేవయ్య, ఎంపీపీ బండమల్లేశం, ఫ్యాక్స్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, సర్పంచ్ కవిత తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.