- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS : అక్క వస్తది..ఆగండి.. కారు దిగుతున్న క్యాడర్.. జోష్ నింపని కేటీఆర్ టూర్
దిశ,జగిత్యాల ప్రతినిధి: త్వరలోనే కవితక్క వస్తది.. అక్క నేను గల్లీ గల్లీ తిరుగుతాం.. పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అంటూ ఇటీవల జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కేటీర్ పర్యటన తర్వాత వలసలకు బ్రేక్ పడినట్లే అని బీఆర్ఎస్ హైకమాండ్ భావించింది. కానీ మీటింగ్ జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే కోరుట్ల మున్సిపల్ ఛైర్పర్సన్ అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరారు. త్వరలోనే మెట్ పల్లి మున్సిపల్ లో కొద్ది మంది ముఖ్య కౌన్సిలర్లు కూడా హస్తం గూటికి చేరతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో వలసల నేపథ్యంలో ఇంతకాలం గులాబీ పార్టీకి కంచుకోటగా జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీ మనుగడ కష్టంగా మారింది.
డైలామాలో బీఆర్ఎస్ క్యాడర్..
వలసల నేపథ్యంలో బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ డైలమాలో పడినట్లు గా తెలుస్తుంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత జైలు పాలవడం.. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, మరోవైపు పార్టీ ఫిరాయింపులతో బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా ఢీలా పడింది. జగిత్యాలలో గెలిచిన సంజయ్ పార్టీ మారడం, ధర్మపురి కి కొప్పుల దూరంగా ఉంటూ వస్తుండటంతో ఆ రెండు నియోజకవర్గాలలో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కోరుట్లలో ఎమ్మెల్యే గా ఉన్న డాక్టర్ సంజయ్ ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికి వలసలకు బ్రేక్ వేయలేక పోతున్నారు. దీంతో చాలా వరకు సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా పార్టీలో కొనసాగుదామా లేదా అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధిష్టానం క్యాడర్ కాపాడుకోవడం లో సక్సెస్ అవుతోందో లేదో అన్నది చూడాల్సి ఉంది.
స్థానిక సంస్థలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందే అవిశ్వాసం అస్త్రంతో జగిత్యాల మున్సిపల్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటీవల కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మెట్ పల్లి బల్దియా ను కూడా హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు పావులు కదుపుతూ వస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్లు గా తెలుస్తుంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుండి మున్సిపాలిటీ ల వరకు చాలా మంది గులాబీ లీడర్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న జోష్ లో ఉన్న కాంగ్రెస్ లీడర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యం తో కారు పూర్తిగా ఖాళీ చేయాలని చూస్తున్నారు.
చివరి అస్త్రంగా తెర పైకి కవిత పేరు..
జిల్లాలో గులాబీ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంతకాలం పార్టీకి విధేయులుగా ఉన్న లీడర్లే ఒక్కొక్కరుగా చేజారుతుండడం ఆ పార్టీ హైకమాండ్ ను కలవరపెడుతుంది. దీంతో చివరి అస్త్రంగా త్వరలోనే ఎమ్మెల్సీ కవిత జైలు నుండి వస్తుందని, రాగానే జగిత్యాల కేంద్రంగా బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం ప్రచారం చేస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల లో ఎమ్మెల్సీ కవితకు పట్టు ఉండటమే కాక సెపెరేట్ క్యాడర్ ఉంది. దీంతో వలసలకు పులిస్టాప్ పెట్టేందుకే ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి తీసుకు వస్తున్నట్లుగా స్పష్టం అవుతుంది. ఇటీవల జగిత్యాలలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే కవిత బయటకు వస్తుందని చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
పార్టీకి దూరంగా టౌన్ లీడర్లు..
జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు,కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాలలో బిఆర్ఎస్ టౌన్ లీడర్లు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది పార్టీ మారగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవాళ్లు పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ పార్టీ హైకమాండ్ పిలుపునిస్తున్న కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు గ్రామాల్లో ఉండే లీడర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణంలో ఏ ప్రోగ్రాం చేసిన టౌన్ లీడర్ల కన్నా గ్రామస్థాయి లీడర్లే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామాల నుండే భారీగా జన సమీకరణ చేయగా జగిత్యాల, ధర్మపురి, రాయికల్ నుండి క్యాడర్ నామమాత్రంగానే హాజరైంది.
- Tags
- Telugu News
- BRS