కోరుట్లలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

by Shiva |
కోరుట్లలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
X

దిశ, కోరుట్ల: పేపర్ లీకేజీలకు, బండి సంజయ్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా బుధవారం పట్టణంలోని జాతీయ రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కోరుట్ల నియోజకవర్గ యువ నాయకులు సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని, బేషరతుగా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన మరువక ముందే పదో తరగతి పేపర్ లీక్ అవ్వడం ప్రభుత్వ అసమర్ధతకు, బాధ్యత రాహిత్యనికి నిదర్శనం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంటేనే లికేజీ., ప్యాకేజి అన్న విధంగా తయారైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజశేఖర్, పెండెం గణేష్, పీసరి నర్సయ్య, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story