- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ధర్నా.. స్వల్ప ఉద్రిక్తత

దిశ, గంగాధర: చొప్పదండి నియోజకవర్గంలో పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులను కాపాడాలంటూ చొప్పదండి నియోజకవర్గం గంగాధరలోని మధురనగర్ చౌరస్తాలో గంగాధర మండల బీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో రైతులతో కలిసి తలపెట్టిన ధర్నా, రాస్తారోకో దిగగా స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. మధుర నగర్ చౌరస్తా వద్ద చొప్పదండి సీఐ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ధర్నా కోసం వచ్చిన బీఆర్ఎస్ నాయకులను వెంటాడి అరెస్ట్ చేశారు.
రైతులు, బీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి రెండు చోట్ల ధర్నా, రాస్తారోకోకు దిగారు. రెండు చోట్ల రైతులు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగడంతో హఠాత్పరిణామానికి గురైన పోలీసులు రెండు చోట్ల ఒక పరుగెత్తుకొని వెళ్లి రైతులను నాయకులను ధర్నా చేస్తున్న ప్రదేశం నుండి పక్కకు తీసుకెళ్లారు. బిఆర్ఎస్ ముఖ్య నేతలను అరెస్ట్ చేసి గంగాధర లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బందోబస్తుకు వచ్చిన కొంతమంది పోలీసులు మధురానగర్ చౌరస్తాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి వచ్చిన ప్రయాణికులను బెదిరింపులకు దిగుతు అతి ఉత్సాహం ప్రదర్శించారు. ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావ్ ఆధార్ కార్డులు చూయించాలంటూ సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. సాధారణ ప్రజలు ఎవరో, నాయకుల ఎవరో పోలీసులకు తెలియదా అంటూ అక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు, అటు పోలీసులతో చౌరస్తాలో గందరగోళ వాతావరణం ఏర్పడడంతో స్థానికులు ఆందోళన గురయ్యారు. ధర్నా విషయం తెలుసుకున్న తరువాత స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.