స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టండి: జిల్లా కలెక్టర్ కు హైకోర్టు ఆదేశం

by Shiva |
స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టండి: జిల్లా కలెక్టర్ కు హైకోర్టు ఆదేశం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల పిటిషన్ సంబంధించి స్ట్రాంగ్ రూం తాళం చెవి మిస్ అయిన విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. కీస్ మిస్ అయిన ఘటనలో ఈసీఐ అధికారులు ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరిపారు. బుధవారం హైకోర్టులో జరిగిన విచారణలో భాగంగా అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూం తెరవాలని జిల్ల కలెక్టర్ ను హైకోర్టు అదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు అవసరమైతే స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టి అందుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలని అని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాళాలు తెరిచే వారి సహాయం తీసుకోవాలని హైకోర్టు జగిత్యాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన విచారణ ఈ నెల 24కు కోర్టు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed