- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేదోళ్ల రాజ్యమే బీజేపీ లక్ష్యం : బండి సంజయ్
దిశ, కోరుట్ల : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలనను కొనసాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంతమొందించి, పేదోళ్ల ప్రభుత్వాన్ని తీసుకురావడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గోస - బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్కత్వం వల్ల పేదలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పై చర్చ చేయకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, దేశ ప్రధాని మోడీ, బీజేపీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ప్రపంచం మొత్తం మోడీని ప్రశంసిస్తుంటే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని, కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి నిధులు వస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంకు ఎన్ని నిధులు ఇచ్చిందో జాబితా తన వద్ద సిద్ధంగా ఉందని, బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. అసెంబ్లీలో లేని ప్రధాని మోడీపై. బీజేపీపై విమర్శలు చేస్తూ, ఇస్తానుసారంగా వ్యాక్యలు చేస్తూ అసెంబ్లీ సభా హక్కులను ఉల్లంగించారని, అలాంటి సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పై ఎలాంటి ప్రసంగం చేయకపోవడం బాధాకరమన్నారు.
కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం 5 వేల కోట్లు అవసరం ఉంటాయని, కాని బడ్జెట్ లో కేవలం 1000 కోట్లు కేటాయించారని, అలాగే రుణ మాఫీకి 25 వేల కోట్లు అవసరంముంటే 6 వేల కోట్లు కేటాయించారని, ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. పాత బస్తీలో కరంటు బిల్లులు, ఇతర పన్నులు కోట్ల రూపాయలు వసూల్ చేయడంలో కేసీఆర్ జంకుతున్నారని, ఒక వర్గం మెప్పు కోసం కేసీఆర్ తహతహ లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిలువ నీడ లేని పేదలకు ఇండ్లు కట్టిస్తామని, ఉచిత వైద్యం, పిల్లలకు ఉచిత విద్యా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశ పెట్టి వారి సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమ గీతం పాడి, ప్రజాస్వామ్య తెలంగాణ సాధించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పేదోళ్ల రాజ్యం రావాలంటే ఒక సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ అవినీతి పాలనకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పైడిపెల్లి సత్యనారాయణ, తుల ఉమ, పూదరి అరుణ, జేయన్ వెంకట్ సునీత, సురభి నవీన్, సాంబారి ప్రభాకర్, దాసరి సునీత రాజశేఖర్, శీలం వేణు, మొలుమూరి అలేఖ్య మురళి, పెండెం గణేష్, మాడవేణి నరేష్, సుఖేందర్ గౌడ్, సుదవేని మహేష్, ఏనుగందుల రాజు, తదితరులు పాల్గొన్నారు.