- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైల్డ్ లైన్ 1098 ఓపెన్ హౌస్ పై అవగాహన..
దిశ, కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప గుట్ట కాలనీలో చైల్డ్ లైన్ 1098 ఓపెన్ హౌజ్ పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫర్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, శివకుమార్,1098 చైల్డ్ లైన్ జిల్లా కో ఆర్డినేటర్ కడారి శ్రావణ్ లు మాట్లాడుతూ పిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, బాల్య వివాహాలు, లైంగిక వేధింపుల గురించి వివరించారు. చైల్డ్ లైన్ 1098 అను సంస్థ 0 నుండి 18 సంవత్సరాలలోపు బాలబాలికల గురించి పని చేస్తుందని తెలిపారు. బాల బాలికలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
బాలకార్మికులు, అనాధ పిల్లలు, లైంగిక వేదింపులకు గురైన పిల్లలు, బిక్షాటన చేసే పిల్లలు, ఎక్కడ కనిపించినా చైల్డ్ లైన్ జాతీయ స్థాయిలో పని చేస్తున్న ఉచిత ఫోన్ నంబర్ 1098 కు తెలియజేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ వారి హక్కులను ఉపయోగించుకుంటూ, తల్లి దండ్రులు, గురువుల పట్ల మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు. అనంతరం చైల్డ్ లైన్ 1098 పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ హేమలత, చైల్డ్ లైన్ 1098 టీం సభ్యులు రజిత, మానస, అంగన్వాడి టీచర్స్ సరిత, రజిత పాల్గొన్నారు.