- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రేపు జిల్లాకు రాష్ట్ర మంత్రులు..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాష్ట్ర మంత్రులు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పార్టీ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, నాయకులు నీలి రవి, యెల్లే లక్ష్మీనారాయణ, నక్క నరసయ్య, చిందం శ్రీనివాస్, బచ్చు ప్రసాద్, అంకెని సతీష్, ఆయూబుఖాన్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు తొలిసారిగా మంత్రి శ్రీధర్ బాబు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రి శ్రీధర్ బాబుకు ఘనస్వాగతం పలకనున్నారు. జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ నుండి అంబేద్కర్, గాంధీ చౌకల గుండా లహరి ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకారున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.