Mid Maneru : మిడ్ మానేరుకు జలకళ

by Sridhar Babu |
Mid Maneru : మిడ్ మానేరుకు జలకళ
X

దిశ, వేములవాడ : వేసవి నేపథ్యంలో గత కొద్దిరోజుల క్రితం వరకు ఎడారిని తలపించిన శ్రీ రాజరాజేశ్వరి జలాశయం(మిడ్ మానేరు) నేడు నిండు కుండలా మారుతుంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గాయత్రి పంపు హౌజ్ సాయంతో రోజుకు 12600 క్యూసెక్కుల నీరును అధికారులు మిడ్ మానేరుకు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 14 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఇన్ ఫ్లో ఇలానే కొనసాగితే మరో

వారం రోజుల్లోనే మిడ్ మానేరు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక మానేరు వద్ద నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ 24గంటలు అందుబాటులో ఉంటూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని ఇరిగేషన్ శాఖ ఏఈఈ(మిడ్ మానేరు) మయూరి తెలిపారు. ఏది ఏమైనా నిన్నమొన్నటి వరకు ఎడారిని తలపించిన మిడ్ మానేరు జలాశయం నేడు నిండు కుండలా మారడం పట్ల మిడ్ మానేరు, మధ్య మానేరు పరీవాహక ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో నీటి విడుదలకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed