- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వేములవాడ ఏరియా ఆసుపత్రి మరో రికార్డు..

దిశ,వేములవాడ : రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 24 గంటల్లో 23 ఆపరేషన్లు చేసి దవాఖాన వైద్యులు సత్తా చాటారు. కార్పొరేట్ కు దీటుగా ముందుకు సాగుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ క్రమంలో 24 గంటల వ్యవధిలో 23 సర్జరీలు విజయవంతంగా పూర్తి చేయగా, ఇందులో 10 డెలివరీలు,2 గర్భసంచిలో గడ్డ, 5 సాధారణ శస్త్ర చికిత్సలు, 1 కంటి ఆపరేషన్, 5 ఆర్తో ఆపరేషన్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సర్జరీల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ సీనియర్ సర్జన్ డాక్టర్ పెంచలయ్య, గైనకాలజిస్ట్ డాక్టర్లు సంధ్య, కంటి వైద్య నిపుణులు రత్నమాల, ఆర్థో డాక్టర్ అనిల్ మరియు మత్తు వైద్య నిపుణులు డా.రాజశ్రీ,డా.తిరుపతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, కలెక్టర్ సహకారంతోనే: డాక్టర్ పెంచలయ్య, ఆసుపత్రి సూపరిండెంట్
వంద పడకల ఆసుపత్రి లో ప్రస్తుతం అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సహకారంతో మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తాం. అట్లాగే వేములవాడ నియోజక వర్గంలో సదరం క్యాంపునకు దరఖాస్తు చేసుకున్న వారు ఆయా తేదీల్లో నిర్ణయించిన సమయానికి రావాలి. వైకల్య నిర్ధారణ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారందరూ సద్వినియోగం చేసుకోవాలి.