- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel: జెరూసలేంలో ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలపై నిషేధం..!
దిశ, నేషనల్ బ్యూరో: జెరూసలేంలోఐక్యరాజ్యసమితి సంస్థ కార్యకలాపాలను ఇజ్రాయెల్ నిషేధించింది. యూఎన్ రిలీఫ్ ఏజెన్సీ (UNRWA) దేశంలోపల పనిచేయకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ పార్లమెంటు చట్టాన్ని తెచ్చింది. పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్ ఆర్ డబ్ల్యూఏ సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థను అడ్డుకోవడానికి రూపొందించిన బిల్లుని ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లుపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ నెతన్యాహు ప్రభుత్వం అగ్రరాజ్య అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ బిల్లు వల్ల గాజాలో మనవతా పరిస్థితులు మరింత దిగజార్చుతాయని పాశ్చాత్య దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, పాలస్తినా శరణార్థుల కోసం యూఎన్ఆర్ డబ్ల్యూఏ 1949 నుంచి జెరుసలేంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతేకాకుండా,లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. సోమవారం నెతన్యాహు సైన్యం జరిపిన దాడుల్లో ఏడుగురు చనిపోయినట్లు లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.