PCC chief: అదానీతో తెలంగాణ సర్కార్ ఒప్పందంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
PCC chief: అదానీతో తెలంగాణ సర్కార్ ఒప్పందంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీపై ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హాట్ కామెంట్స్ చేశారు. చట్టానికి లోబడే వ్యాపారాలనే తెలంగాణలో అనుమతి ఇస్తామని అది అదానీ అయినా అంబానీ అయినా సరే అన్నారు. అదానీ (Adani) అవినీతి నిరూపితమైతే ఆయన తెలంగాణలో పెట్టుబడులపై పునరాలోచన చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అదానీకి ఇప్పటి వరకు ఇంచు భూమి ఇవ్వలేదని స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం ఇచ్చారన్నారు. అవి రేవంత్ రెడ్డి సొంత పాకెట్ కు ఇవ్వలేదని ప్రజా అవసరాలకు ఇచ్చిన విరాళం. రేపు కేటీఆర్ (KTR) వచ్చి విరాళం ఇస్తామంటే స్వీకరిస్తామన్నారు. గతంలో ఈ రాష్ట్రంలో అదానీ కార్యకలాపాలు సాగాయని అప్పుడు అదానీ డబ్బులు మీకు వ్యక్తిగతంగా ముట్టాయని ఆరోపించారు. చట్టరీత్యా వ్యాపారాలు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎటుంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు బయటకు వచ్చిన అంశంపై జేపీసీ కోరుతున్నామన్నారు. జేపీసీ ఏర్పాటై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే మోడీ ప్రధానిగా తప్పుకోవాల్సి వస్తుందన్నారు. అదానీ అవినీతిపై రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదు అర్హత లేకపోయినా అదానీకి రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చారని ఆరోపించారు. దేశంలో దొపిడీ జరుగుతుంటే మోడీ కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. తక్షణమే అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ ఇష్యూలో సెబీ పూర్తిగా విఫలమైందని సెబీ చైర్మన్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed