Bandi Sanjay: కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లీగల్ నోటీసులకు బండి సంజయ్ రిప్లయ్

by Shiva |   ( Updated:2024-10-29 07:06:26.0  )
Bandi Sanjay: కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లీగల్ నోటీసులకు బండి సంజయ్ రిప్లయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Union Minister Bandi Sanjay)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ (BRS Working President, Former Minister KTR) ఇటీవలే లీగల్ నోటీసు పంపారు. తాజాగా, కేటీఆర్‌ లీగల్‌ నోటీసుపై కేంద్ర మంతి బండి సంజయ్ కౌంటర్ నోటీసు ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని మరోసారి స్పష్టం చేశారు. పొలిటికల్ విమర్శలపై తనకు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అయినా, లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తక్షణమే తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలను వెనక్కి తీసుకుని కేటీఆర్ (KTR) బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసకుంటానని అన్నారు. నిరాధారమైన ఆరోపణలకు ఖచ్చితమైన రుజువు లేకుండా.. దురుద్దేశపూర్వకంగా తన క్లయింట్‌కు కేటీఆర్ (KTR) లీగల్ నోటీసులు ఇచ్చారని బండి సంజయ్ తరఫు న్యాయవాది ఇవాళ కౌంటర్ నోటీసులు దాఖలు చేశారు.

కాగా, అక్టోబర్ 19న కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister) మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ (KTR) లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌ (Phone Tapping)కు పాల్పడ్డానంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) పేరును కూడా కేంద్ర మంత్రి ప్రస్తావరించారని ఆరోపించారు. కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు తాను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో రహస్యంగా భేటీ అయినట్లుగా నిందలు వేశారని ఆక్షేపించారు. ఓ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో రావడం వల్ల ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని కేటీఆర్ (KTR) తాను ఇచ్చిన లీగల్ నోటీసుల్లో ప్రస్తావించారు.

Advertisement

Next Story