- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rojgar Mela: ఎన్నికల వరకే రాజకీయాలు.. శత్రుత్వాల్ని పక్కనపెట్టండి : కేంద్రమంత్రి బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరినా (VMRDA children's Arena)లో నిర్వహించిన రోజ్ గార్ మేళా (Rojgar Mela)లో కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతీయువకులకు ఆయన అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రోజ్ గార్ మేళాను ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) రెండేళ్ల క్రితం ప్రారంభించారని తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ రోజ్ గార్ మేళాను ప్రారంభించినట్లు వెల్లడించారు. రెండేళ్లలో 8 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి బండిసంజయ్ చెప్పారు.
ఇక తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీలు తమ పగలు, శతృత్వాలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని.. అభివృద్ధిలో అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. పోలవరంకు (Polavaram) జాతీయ హోదా కల్పించింది మోదీ ప్రభుత్వమే అన్న ఆయన.. విశాఖపట్నం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.