- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికి మార్గదర్శకుడు అంబేద్కర్: మంత్రి గంగుల
దిశ, కరీంనగర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికే మార్గదర్శకుడని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలం చేకూర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు అంబేద్కర్ విగ్రహాన్ని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పడు ఆయన పేరును వాడుకున్నారే తప్ప ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు.
సమైక్య రాష్ట్రంలో దళితుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని దళిత బంధు అనే గొప్ప పథకం ప్రవేశపెట్టారని మంత్రి గుర్తు చేశారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో నిర్మించే పార్లమెంటు భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించే సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు, హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
చేకుర్తి గ్రామస్తుల చిరకాల వాంచ చేకుర్తి మగ్దంపూర్ రోడ్డుకు త్వరలో నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, రసమయి బాలకిషన్, అరుణ రాజయ్య, ఎంపీటీసీ ఎలుక పెళ్లి స్వరూప మోహన్, ఉపసర్పంచ్ గాండ్ల విజయ, రాజా లింగం, చమనపల్లి చంద్రశేఖర్, సముద్రాల అజయ్, కంసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.