- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాపం.. పండుటాకుకు ఎంత కష్టమొచ్చె...
తల్లి బాగోగులు చూడటం లేదని అన్నపై ప్రజావాణిలో చెల్లెలి ఫిర్యాదు
దిశ, జగిత్యాల ప్రతినిధి : సవతి తల్లి అనే కారణంతో తన తల్లి బాగోగులు చూడడం లేదంటూ ఓ చెల్లెలు తన అన్నపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక భవానీనగర్ కు చెందిన బొందుకూరు అనంతలక్ష్మి తన తండ్రి మరణం తర్వాత తల్లి సింహారాజు దేవేంద్ర బాగోగులు చూస్తూ వస్తుంది. అయితే, తన అన్న అయిన సింహారాజు గంగాధర్ తన తల్లిని మొత్తానికే పట్టించుకోవడం లేదని ఆమె పూర్తి బాధ్యత తనపైనే వదిలేశాడని ఆరోపించింది.
ఇదే విషయమై ఇప్పటికే ఆర్డీవో కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. విచారణ జరిపిన ఆర్డీవో ఇద్దరినీ చెరో ఆరు నెలలు వంతుల వారీగా చూసుకోవలసిందిగా సూచించినట్లు అనంతలక్ష్మి తెలిపింది. అయినప్పటికీ అన్న సింహారాజు గంగాధర్ ఇప్పటికి తన తల్లి బాగోగులు చూడడం లేదంటూ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఈ విషయంలో తనకు, తన తల్లికి న్యాయం చేయాలంటూ ప్రజావాణిలో కలెక్టర్ కు విన్నవించింది.