- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SP Akhil Mahajan : నిందితులు నేర ప్రవృత్తిని మార్చుకోవాలి
దిశ, గంభీరావుపేట : నిందితులు నేర ప్రవృత్తిని మార్చుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి, దొంగతనం కేసులలో పట్టుబడిన వారికి బుధవారం స్టేషన్ పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. తమ నేర ప్రవృత్తిని మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని, లేకుంటే హిస్టరీ షీట్స్, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గతంలో గంజాయి, దొంగతనం కేసులలో ఉన్న పాత నెరస్తులపై పోలీస్ నిఘా ఎప్పుడూ ఉంటుందని అన్నారు. జిల్లాలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. గంజాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
గంజాయి పాజిటివ్ వచ్చిన వారి ద్వారా సరఫరా దారులను పట్టుకుంటున్నామని తెలిపారు. అనంతరం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రోజూ ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకొని, డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. తమకు కేటాయించిన గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రామ్మోహన్ ,సిబ్బంది పాల్గొన్నారు.
- Tags
- SP Akhil Mahajan