- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
by Shiva |
X
దిశ, కోరుట్ల రూరల్: మండలంలోని అయిలాపూర్ గ్రామ శివారులో గల తోటలోని బోరుబావి లోపలి నుంచి మోటార్ ను తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం అయిలాపూర్ గ్రామ శివారులోని ఓ తోటలో బోరుబావిలోని మోటార్ పని చేయకపోవడంతో మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన ఆమంది గంగాధర్(53), బొద్దుల సత్యనారాయణలు మరమ్మతులు చేపట్టారు.
ఈ క్రమంలో ఇరుక్కుపోయిన మోటార్ ను బయటకు తీస్తున్న క్రమంలో చైన్ బ్లాక్ తెగి గంగాధర్ తలపై పడడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు గంగాధర్ కు భార్య లక్ష్మీ, కొడుకు, కూతురు ఉన్నారు.
Advertisement
Next Story