కేటీఆర్ పర్యటన ఉన్నప్పుడల్లా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు: రంజిత్ కుమార్

by S Gopi |
కేటీఆర్ పర్యటన ఉన్నప్పుడల్లా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు: రంజిత్ కుమార్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఏబీవీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన భాగంగా డా. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని శిక్షించాలని నిరసన తెలుపుతున్న సమయంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ తోపాటు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నాగరాజును 2 రోజులపాటు పోలీస్ స్టేషన్ లో బంధించడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ప్రీతి కుటుంబనికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ పర్యటన ఉన్నప్పుడల్లా ఏబీవీపీ నాయకులను అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ లు చేస్తూ వేధిస్తున్నారని అన్నారు. మమ్మల్ని అరెస్ట్ చెయ్యంది మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేరా అని ప్రశ్నించారు. మీరు సమస్యలు పరిష్కారం చేస్తే మేము ఎందుకు మిమ్ము ప్రశ్నిస్తాం..? విద్యారంగా సమస్యలపైన పోరాడుతే కేసులు, జైళ్లకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వందల మందిని ముందస్తు అరెస్టులు, 500 మంది పోలీసులతో బందోబస్తులు ఉంటే గానీ కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ఔకత్ ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.

కేటీఆర్ తమ నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిసారి కనీసం ఇంట్లో వాళ్లకు కూడా సమాచారం ఇవ్వకుండా రాత్రుల్లు అక్రమంగా అరెస్టు చేసి ఒకటి, రెండు రోజులు స్టేషన్ లో బందిస్తూ, ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇప్పటికే నాపై అక్రమంగా 50కి పైగా కేసులు పెట్టడమే కాకుండా రౌడీ షీట్ తెరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏబీవీపీ నాయకులకు ఏమి జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. దీనికి పూర్తి కారకులు మంత్రి కేటీఆర్ అని అన్నారు. ప్రెస్ మీట్ లో జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు, తిరుపతి, సాయితేజ, నవీన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story