పోస్టాఫీసుల్లో మళ్లీ ఆధార్ సేవలు : కరీంనగర్ పోస్టల్ సూపరిండెంట్ పసునూరి ప్రభాకర్

by Shiva |   ( Updated:2023-05-24 02:00:39.0  )
పోస్టాఫీసుల్లో మళ్లీ ఆధార్ సేవలు : కరీంనగర్ పోస్టల్ సూపరిండెంట్ పసునూరి ప్రభాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్ : ప్రజల సౌకర్యార్థం మళ్లీ పోస్టాఫీసులలో ఆధార్ సేవలను కొనసాగించనున్నారు. ప్రస్తుతం కరీంనగర్ హెడ్ పోస్టాఫీసులో మాత్రమే ఆధార్ సేవలు కొనసాతుండగా, త్వరలో సిరిసిల్ల, మెట్ పల్లిలలో కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ పసునూరి ప్రభాకర్ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల సౌకర్యం కోసమే తిరిగి ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్ హెడ్ పోస్టాఫీసులో ఆధార్ సేవలు కొనసాగుతున్నాయని, వచ్చే జూన్ నెలలో సిరిసిల్ల, మెట్ పల్లి పోస్టాఫీసులలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇందుకు అవరసమైన సన్నాహాలు చేస్తున్నామని, కొత్తగా ఆధార్ తీసుకోవడంతో పాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పసునూరి ప్రభాకర్ కోరారు.

Advertisement

Next Story