నా భర్త మృతిపట్ల నాకు అనుమానంగా ఉంది.. విద్య

by Sumithra |
నా భర్త మృతిపట్ల నాకు అనుమానంగా ఉంది.. విద్య
X

దిశ, గోదావరిఖని : తన భర్త మృతి పట్ల అనుమానం ఉందని, ఆయనకు సంబంధించిన మిత్రులను విచారించి న్యాయం చేయాలని ఓ మహిళ ఆందోళనకు దిగింది. అంతర్గాం మండలం సోమన్ పల్లికి చెందిన విద్య తన భర్త వేణుగోపాల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందాడు. స్నేహితుల వెంట వెళ్ళిన వేణుగోపాల్ కు ఎలా ప్రమాదం జరిగిందో తనకు ఎవరు చెప్పడం లేదని ఆమె ఆరోపించింది.

ఇదే క్రమంలో తనకు న్యాయం చేయాలని విద్య తన కుటుంబ సభ్యులతో కలిసి సోమన్ పల్లిలోని భర్త స్నేహితుడు వెంకటేష్ ఇంటి ఎదుట బైఠాయించింది. ఏప్రిల్ 22న రాత్రి తన భర్తను పిలిపించుకుని మిత్రులు మద్యం సేవించారని, తెల్లవారేసరికి ప్రమాదంలో గాయపడ్డాడని ఆమె పేర్కొంది. అయితే చికిత్స పొందుతూ అదే నెల 27న వేణుగోపాల్ మరణించాడని తెలిపింది. ఈ విషయంలో తనకు అనుమానం ఉందని, తన భర్త మృతి పట్ల పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story