నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. ఎమ్మార్వోకు వినతి పత్రం..

by Sumithra |
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. ఎమ్మార్వోకు వినతి పత్రం..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి విన్నవించాలని జగిత్యాల రూరల్ ఎమ్మార్వో నవీన్ కు బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులకు ఎకరాకు 80వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, అలాగే, వరి, మొక్కజొన్న, నువ్వు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ చిలకమర్రి మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story