పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని వ్యక్తి హల్చల్..

by Sumithra |
పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని వ్యక్తి హల్చల్..
X

దిశ, పెద్దపల్లి : పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుంటానని వ్యక్తి హల్చల్ చేసిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ రెహ్మాన్ ఒంటి పై పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేశాడు. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తన ఆటో తీసుకువచ్చారని, తాను ఏం నేరం చేశానని, ఎందుకు ఆటో తీసుకువచ్చారని ఒక దొంగలా తనను వీడియో తీశారని ఆరోపించాడు. అప్రమత్తమైన పోలీసులు రెహమాన్ ను సముదాయించి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లారు.

Advertisement

Next Story