- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ వ్యవహారంలో కీలక పరిణామం
దిశ,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల రీకౌంటింగ్ ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎలక్షన్ పిటిషన్ కు సంబంధించిన స్ట్రాంగ్ రూం లోని 17A, 17C పత్రాలతో పాటు వీడియో ఎవిడెన్స్ కోర్ట్ కు సమర్పించాల్సిందిగా ఎలక్షన్ అధికారికి ఆదేశాలు అందాయి. కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 10న స్ట్రాంగ్ రూం తెరిచేందుకు అధికారులు ప్రయత్నించగా.. తాళంచెవి కాకపోవడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే, తాళాలు ఓపెన్ కాలేదన్న విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు.
నేడు కొనసాగనున్న విచారణ...
స్ట్రాంగ్ రూం తాళం చెవులు ఎలా మిస్ అవుతాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు తాళం చెవులు పోయిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి కోర్టుకు ఏప్రిల్ 26 న వివరాలను సమర్పించాలని ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు నేడు ఈసీఐ నుంచి జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు అధికారులు రానున్నారు. తాళం చెవులు మిస్ అయిన ఘటనతో పాటు 2018 నుంచి ఈ విషయంలో ఇప్పటి వరకు జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకొని పూర్తి నివేదికను కోర్టు ముందు ఉంచనున్నట్లు సమాచారం.