- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ellampalli project : ఎల్లంపల్లి ప్రాజెక్టులో 17.81 టీఎంసీల నీటినిల్వ..
దిశ, పెద్దపల్లి : జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16,081 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, నంది పంప్ హౌస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ద్వారా అదే స్థాయిలో నీటిని పంపిణీ చేస్తున్నామని, ఎల్లంపల్లి ప్రాజెక్టులో స్థిరంగా 17.81 టీఎంసీల నీటి నిల్వ ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్ ను సందర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద వివరాలు, ఔట్ ఫ్లో, ప్రాజెక్టులో నీటినిల్వ తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి కడెం ప్రాజెక్టు నుంచి 8 వేల 203 క్యూసెక్కులు, స్థానిక క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 7 వేల 879 క్యూసెక్కులు మొత్తం 16 వేల 081 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో వస్తుండగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకు 331 క్యూసెక్కుల నీటిని, నందీప్ పంప్ హౌస్ ద్వారా 15 వేల 750 క్యూసెక్కుల వరదను ఎత్తిపోస్తున్నామని, ప్రాజెక్టులో మొత్తం 17.81 టీఎంసీల నీటినిల్వ స్థిరంగా ఉందని, ఎల్లంపల్లి రిజర్వాయర్ 62 గేట్లు మూసి ఉన్నాయని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.