Karimnagar: సంజయ్ రెచ్చగొట్టడం వల్లే ఘటన.. మాజీమంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
Karimnagar: సంజయ్ రెచ్చగొట్టడం వల్లే ఘటన.. మాజీమంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ రెడ్డి ఇరిటేట్ అయ్యాడని, ఎమ్మెల్యేను లాక్కెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(BRS Leader Gangula Kamalakar) అన్నారు. కరీంనగర్(Karimnagar) లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collector Office) లో జరిగిన ఘటనపై స్పందించారు. నిన్న కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ముగ్గురు మంత్రులు వచ్చారని మమ్మల్ని ఆహ్వానిస్తే మేం వెళ్లామని, తమ ఎజెండా కూడా క్లియర్ గా ఉందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నామని, ఇందులో భాగంగానే మా డిమాండ్స్ సభ ముందు పెట్టామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు వచ్చినట్టు ఫోటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు, క్లారిటీ ఇవ్వాలని కోరామని, కానీ దానికి ఎటువంటి సమాధానం రాలేదని మండిపడ్డారు. ఇక కౌశిక్ రెడ్డి(Padi Kowshik Reddy), సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) వ్యవహారంలో కౌశిక్ ను పోలీసులు గుంజుకెళ్లడం విచారకరమని, నేనేనాడూ అలాంటి ఘట్టాలను చూడలేదని అన్నారు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తెనే గుంజుకువెళ్లారా? అని, అలా అనుమతి ఇచ్చినట్టు అయితే మీరు సభ నడపడంలో విఫలమైనట్టేనా? అని నిలదీశారు.

మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ సమయంలో సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడని, కోపతాపాలు సర్వసాధారణం అని, కంట్రోల్ చేయాలని సూచించారు. ఇక ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు ఎంతమందిపై కేసులు పెడతారు అని, అదేమైనా బలప్రదర్శన వేదికనా అని దుయ్యబట్టారు. ఈ విషయంలో కౌశిక్ రెడ్డిపై పెట్టిన పోలీస్ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్, సంజయ్ మధ్య ఏం జరిగిందనేది వ్యక్తిగత విషయం అని, కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేదే మా ప్రశ్న అంటూ.. దీనికి సమాధానం చెప్పాలని గంగుల కోరారు.

Next Story