Praful desai: వివాదంలో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్!.. ఫోటోలపై నెటిజన్ల ట్రోల్

by Ramesh Goud |   ( Updated:2024-07-18 12:11:51.0  )
Praful desai: వివాదంలో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్!.. ఫోటోలపై నెటిజన్ల ట్రోల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఐఏఎస్ ఉద్యోగాలు సంపాదించిన వారి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే వ్యవహారం బయటకు రావడంతో ఆమె యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించిందనే కారణంతో ట్రైనింగ్ నిలుపుదల చేశారు. అలాగే మరో ఐఏఎస్ నఖిలీ బీసీ సర్టిఫికేట్ తో ఉద్యోగం సంపాదించాడని ధర్యాప్తులో తేలింది. అయితే ఇప్పుడు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ప్రఫుల్ దేశాయ్ సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో యూపీఎస్సీని మోసం చేసి ఉద్యోగం సంపాదించారని నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

ప్రఫుల్ దేశాయ్ దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ ఉద్యోగం సాధించాడు. అయితే ఆయన ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ, బ్యాట్మింటన్ వంటి సహాసాలు చేస్తున్న ఫోటోలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై దివ్యాంగుడైన మీరు ఇలాంటి సహాస కృత్యాలు ఎలా చేశారని నెటిజన్లు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ ప్రఫుల్ దేశాయ్ ను ట్యాగ్ చేస్తూ.. ఈడబ్ల్యూఎస్ ఆర్ధోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ కోటాలో ఉద్యోగం సంపాదించారని, ట్విట్టర్ లో వైరల్ అవుతున్న సహాసాలు మీకు ఎలా సాధ్యమయ్యాయని, ఈ సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రఫుల్ దేశాయ్.. తాను దివ్యాంగుడినని ఢిల్లీ ఎయిమ్స్ సర్టిఫికేట్ ఇచ్చిందని, ఈ విషయంలో తాను ఎలాంటి పరీక్షకైనా సిద్దమని అన్నారు. అలాగే వైరల్ అవుతున్న ఫోటోలు ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా చేసినవి అని, దివ్యాంగుడిగా ఉన్న తాను పరిస్థితులను అధిగమించి అందరిలా జీవించాలని ప్రయత్నించడం తప్పా అని నెటిజన్ ను ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed