- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటలనే రూ.5 కోట్లు తీసుకున్నారు.. కల్వ సుజాత సంచలన ఆరోపణలు
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు అధికార బీఆర్ఎస్ నుంచి ఆర్థిక సహాయం అందిందన్న ఈటల వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయడంతో పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారింది. దీంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ క్రమంలో ఈటలపై కాంగ్రెస్ దాడి పెంచింది. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు సరికావని, ఇన్నాళ్లు కేసీఆర్ చేసిన ప్రతి దుర్మార్గంలోనూ ఆయనకు భాగస్వామ్యం ఉందని కాంగ్రెస్ పార్టీ ఎటాక్ చేయగా.. తాజాగా కాంగ్రెస్ నేత కల్వ సుజాత ఈటలపై సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఈటల రాజేందర్ డబ్బులు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. నాటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్‌కు మద్దతు ఇవ్వకుండా.. బీఆర్ఎస్ అభ్యర్థిగా వరదా రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించేందుకు అతడి తమ్ముడు పౌల్టీ వ్యాపారి ద్వారా రూ.5 కోట్లు ఈటల రాజేందర్ తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మునుగోడు వ్యాఖ్యల విషయంలో ఇప్పటికే ఈటల డైలామాలో పడిపోయారని ప్రచారం జరుగుతున్న వేళ గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఆర్థికంగా లబ్ధిపొందాడని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది.
Also Read..