ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం జ్యుడీషియల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ భేటీ

by Prasad Jukanti |
ఇరిగేషన్ అధికారులతో  కాళేశ్వరం జ్యుడీషియల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడీషియల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ భేటీ అయింది. గురువారం హైదరాబాద్‌ లోని బీఆర్కే భవన్ లోని కాళేశ్వరం విచారణ కమిషన్ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్, కమిషన్ సభ్యులు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేపట్టిన న్యాయవిచారణలో భాగంగా ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పీసీ ఘోష్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించారు. అనంతరం అధికారులు, ఇంజనీర్లతో పీసీ ఘోష్ కమిషన్ సభ్యుల సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed