నేను ముఖాలను చూసి విచారణ చెయ్యను.. కాళేశ్వరం కమిటీ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్‌ కీలక ప్రకటన

by GSrikanth |
నేను ముఖాలను చూసి విచారణ చెయ్యను.. కాళేశ్వరం కమిటీ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్‌ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌ను నియమించిన విషయం తెలిసిందే. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం కోరింది. విచారణ నిమిత్తం హైదరాబాద్‌ను వచ్చిన ఆయన్ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీ ఘోష్ మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రిఫర్ ప్రకటన ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తామని అన్నారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకుని విచారణ మొదలు పెడతామని చెప్పారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్టును పరిశీలనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఇంజినీర్లతో త్వరలోనే భేటీ అవుతాం.. ఎన్డీఎస్ఏ అథారిటీతో కూడా సమావేశం అవుతామని పేర్కొన్నారు.

టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తామని అన్నారు. తాను స్వతహాగా ఇంజినీర్ను కాదని.. తనకు అందరి సహాయ సహకారాలు అవసరమని అభిప్రాయపడ్డారు. తాను ముఖాలను చూసి విచారణ చెయ్యను.. లీగల్ అంశాలను ఆధారంగానే విచారణ కొనసాగుతుందని అన్నారు. బ్యారేజీలతో సంబంధం ఉన్న అందరినీ కలుస్తాం మాకు కావాల్సిన సహాయక సహకారాలను తీసుకొని విచారణ చేస్తాం. లీగల్ సమస్యలు తలెత్తకుండా విచారణ కొనసాగిస్తాం ఏదైనా ఇబ్బంది అయితే స్టే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నిర్మాణ సంస్థలతో పాటు అవసరమైతే రాజకీయ నాయకులకు సైతం నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఇస్తాం. సెకండ్ విజిట్లో మేడిగడ్డ గ్రౌండ్‌కు వెళ్లి బ్యారేజీలను పరిశీలిస్తాం. ఇప్పటికైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా విషయాలను తెలుసుకున్నాను. నివేదికల ఆధారంగానే విచారణ కొనసాగుతుంది.. దానితోపాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటామని ఘోష్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed