కాళేశ్వరం కరప్షన్ లెక్కలు.. రిటైర్డ్ ఈ-ఇన్-సీపై ఎంక్వయిరీ కమిషన్ ప్రశ్నల వర్షం

by karthikeya |
కాళేశ్వరం కరప్షన్ లెక్కలు.. రిటైర్డ్ ఈ-ఇన్-సీపై ఎంక్వయిరీ కమిషన్ ప్రశ్నల వర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు కరప్షన్‌పై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చం ద్రఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (గజ్వేల్) హరిరామ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి ఆలోచన?... మూడు బ్యారేజీలకు ఆలోచన చేసిందెవరు?.. రుణాలు తీసుకోడానికి కార్పొరేష న్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనక ఉన్నదెవరు?... ఇది కంపెనీగా ఎలా మారింది?... ప్రతీ సంవత్సరం ఫైనాన్షియల్ రిపోర్టులు సమర్పిస్తున్నారా?.. కార్పొరేషన్ ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్ జరిగిందా?... ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించడం సరే... కానీ సీఈఓను ఎందుకు నియమించలేదు?.. ప్రాజెక్టు నిర్మాణం కోసం బ్యాంకులు, ద్రవ్య సంస్థల నుంచి తీసుకున్న అప్పు ఎంత?.. అందులో తీర్చిన ‘అసలు’ ఎంత?.. వ డ్డీల పేరుతో ఇప్పటిదాకా జరిగిన పేమెంట్ ఎంత?.. ఈ వివరాలన్నింటినీ ఆడిట్ రిపోర్టులో పేర్కొన్నారా?... కమిషన్ తీసుకున్న అప్పులు, వడ్డీల భారాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకెళ్లారా?.. ఇలా దాదాపు 90 ప్రశ్నలతో హరిరామ్‌ను జస్టిస్ పీసీ ఘోష్ శుక్రవారం క్రాస్ ఎగ్జామిన్ చేశారు.

ఇప్పటిదాకా ఇంజినీర్లను, అధికారులను సాంకేతిక అంశాలపై ప్రశ్నించడంతో పాటు వారు సమర్పించిన అఫిడవిట్‌లలోని వివరాలతో క్రాస్ ఎగ్జామిన్ చేసిన జస్టిస్ పీసీ ఘోష్... రిటైర్డ్ ఈ-ఇన్-సీ హరిరామ్‌పై మాత్రం ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలతో వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. పలు ప్రశ్నల్లో మాజీ ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్లు హరిరామ్ అంగీకరించారు. మూడు బ్యారేజీలకంటే ముందే తుమ్మిడిహట్టిని కట్టాలనే నిర్ణయం జరిగిందని, కానీ 152 మీటర్ల ఎత్తుతో కట్టేందుకు ప్రణాళికలు రూపొందించగా ముంపు ప్రాంతం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, దీంతో 148 మీటర్లకు కుదించాల్సి వచ్చిందని హరిరామ్ వివరించారు. మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ అప్పటి సీఎం చర్చల తర్వాతనే మూడు బ్యారేజీల ఆలోచన వచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఎలా జరిగిందని జస్టిస్ ఘోష్ ప్రశ్నకు హరిరామ్ పై విధంగా బదులిచ్చారు.

కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హరిరామ్ సమాధానం ఇచ్చిన వెంటనే దానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌ను కమిషన్‌కు అందజేయాలని ఆదేశించారు. తొలుత కార్పొరేషన్‌గా ఏర్పడినా ఆ తర్వాత అది కంపెనీగా ఎలా మారిందని ప్రశ్నించారు. ఈ కార్పొరేషన్ ఆర్థిక వ్యవహారాలకు ఆడిట్ జరిగిందా లేదా అని ప్రశ్నించగా... 2016 నుంచి 2021 వరకు ఆడిట్ అయిందని బదులిచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టు నిర్మాణానికి 10 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నామని, ఆ మేరకు వాటితో అవగాహనా ఒ ప్పందాలు, అండర్‌టేకింగ్ ప్రక్రియలు జరిగాయన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా ఇప్పటివరకు రూ. 87,449 వేలకోట్ల లోన్‌లు సాంక్షన్ అయ్యాయని, ఇందులో బ్యాంకుల నుంచి రూ. 62,825 కోట్లు రిలీజ్ అయ్యాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం బ్యాంకుల ద్వారా రూ. 10 వేల కోట్ల లోన్ తీసుకోగా అందులో రూ. 7,100 కో ట్లు రిలీజ్ అయ్యాయని, బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని హరిరామ్ వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అం శాలపై జస్టిస్ పీసీ ఘోష్ వేసిన ప్రశ్నల్లో చాలావాటికి హరిరామ్ బదులివ్వకుండా దాటవేశారు. గుర్తుకులేదు.. స్పష్టత లేదు... వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.. చూసిన తర్వాత చెప్తాను... ఇలాంటి సమాధానాలు ఇవ్వడంతో కమిషన్ ముందు శనివారం కూడా హాజరుకావాలని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. ఇప్పుడు సమాధానం చెప్పలేకపోయిన ప్రశ్నలకు వీలైనంత వరకు వివరాలు అందిస్తానని హామీ ఇవ్వడంతో పాటు తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లను కూడా సమర్పిస్తామని జస్టిస్ ఘోష్‌కు స్పష్టం చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న మొత్తం అప్పుల్లో బ్యాంకులకు దాదాపు రూ. 29,737 కోట్లను రీపేమెంట్ చేసినట్లు తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో సుమారు రూ. 64 వేల కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు తెలిపారు. మాజీ ఈ-ఇన్-సీ మురళీధర్ పేరును ప్రస్తావించారు. కాళేశ్వరం కార్పొరేషన్ వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంశంపై కమిషన్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వానికి సమర్పించామని హరిరామ్ రిప్లై ఇచ్చారు.

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడవ బ్లాకులో జరిగిన డ్యామేజీ, పిల్లర్లకు పగుళ్లపై ఒక ప్రొఫెషనల్ ఇంజి నీర్‌గా హరిరామ్ అభిప్రాయాన్ని కోరారు. ఈ-ఇన్-సీగా పనిచేసినప్పుడు ఆ బ్యారేజీ నిర్మాణం లో జరిగిన లోపాలపై జస్టిస్ గోష్ ఆరా తీశారు. భారీ ఖర్చుతో కట్టిన బ్యారేజీకి జరిగిన డామేజ్‌కు ఎవరు బాధ్యులు అంటూ నిలదీశారు. గేట్లను శాస్త్రీయ పద్ధతిలో, మాన్యువల్ ప్రకారం ఆపరేట్ చేయడంలో మెయింటెనెన్స్ చేపట్టడంలో చోటు చేసుకున్న లోపమే ప్రధాన కారణం అని వివరించారు.

Advertisement

Next Story