- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్వకుంట్ల కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జనగామ జిల్లా మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న కడియం శ్రీహరి.. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేదని, అన్నీ వారికి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేశారని మండి పడ్డారు. కల్వకుంట్ల కుటుంబం పదేళ్ళ పాటు రాష్ట్రం మీద పడి దోచుకుందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం దోపిడిని ప్రశ్నించాననే అక్కసుతో నన్ను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బీఆర్ఎస్ అంటే పార్టీ కాదని.. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ అని పేర్కొన్నారు. దమ్ముంటే 2014 లో కేసీఆర్ ఆస్తులు ఎంత ఉన్నాయో.. ఇప్పుడు ఎంత ఉన్నాయో వెల్లడించాలని సవాల్ చేశారు. అంత నీతిమంతులు అయితే వారి ఆస్తుల వివరాలు బయట పెట్టాలని కడియం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని.. వారి మాటలు నమ్మితే నష్టపోతామని ప్రజలకు సూచించారు.