K. A. Paul : రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పై కేఏపాల్ కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
K. A. Paul : రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పై కేఏపాల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని అన్నారు. పది రోజులు విదేశాల్లో తిరిగి సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వొచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఇన్ని కంపెనీలు వున్నాయి కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయా అంటే లేదు అని విమర్శించారు. గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. అక్టోబర్ 1,2,3 తేదీల్లో లాస్ ఎంజెల్స్‌లో గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ జరుపుతున్నామని, ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని సమ్మిట్ కి పిలిచానని చెప్పారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక పోతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు కూడా బాధ పడ్డారని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, రాష్ట్రం కోసం చంద్రబాబుతో కలిసి పని చేయడానికి తాను సిద్దమని ప్రకటించారు. నన్ను కలవడానికి చంద్రబాబు సిద్దమా? అంటూ పాల్ ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబు గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కు వస్తే అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిపిస్తానని కేఏ పాల్ వెల్లడించారు. హైకోర్టు లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వాలేదని ఫీల్ వేశానని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా వస్తే మనకు రాయతీలు వస్తాయన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఏమీ ఇవ్వలేదని, అమరావతి కి 15వేల కోట్లు అప్పు ఇస్తామని అంటుంది.. అప్పు మనకెందుకు అని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ రావాలంటే చంద్రబాబు అమెరికా రావాలని సూచించారు. లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తాను.. ఇన్విస్ట్మెంట్ తీసుకుని రాకపోతే ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టానని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed