టీ.కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే ఎవరో తేల్చేసిన KA పాల్

by GSrikanth |
టీ.కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే ఎవరో తేల్చేసిన KA పాల్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్‌నాథ్ షిండే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శివసేన ప్రభుత్వాన్ని పడగొట్టి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. అనంతరం తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఏక్‌నాథ్ షిండే పుట్టబోతున్నాడని రాజకీయ నేతలు తరచూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పదే పదే ప్రభుత్వ కూల్చివేతపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు ప్రస్తావిస్తున్నారు.

ఈ కామెంట్స్ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కన్‌ప్యూజ్ చేస్తుండగా.. తాజాగా కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే ఎవరో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తేల్చేశారు. ఈ సందర్భంగా పాల్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ క్షణంలోనైనా ప్రభుత్వాన్ని పడగొట్టే ఛాన్సుందని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగానే రైతుబంధు డబ్బులు రూ.5 వేల కోట్లు పొంగులేటి తన ఖాతాలో వేసుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story