- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గద్దర్‌కు కేఏ పాల్ బిగ్ షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: గద్దర్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాక్ ఇచ్చారు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు కేఏ పాల్ ప్రకటించారు. గద్దర్ కొత్త పార్టీ ఊహకు అతీతంగా ఉందన్నారు. గతేడాది మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటానని పార్టీలో చేరారని, తీరా రేవంత్ రెడ్డితో గద్దర్,ఆయన కుమారుడు రూ.150 కోట్ల డీల్ కుదుర్చుకుని పోటీ నుండి తప్పుకున్నాడని ఆరోపించారు.
ఈ విషయం తనకు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఒకరు చెప్పారన్నారు.'గద్దర్ ప్రజాపార్టీ' పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాల నిమిత్తం గద్దర్ ఢిల్లీకి వెళ్లారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కార్యాలయంలో ఆయన నూతన పార్టీ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వీడియోను రిలీజ్ చేసిన కేఏ పాల్ గద్దర్‌ను ప్రజాశాంతి నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజాశాంతి పార్టీపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అమరవీరుల ప్రతినిధిగా శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి జూన్ 1న ప్రజాశాంతి పార్టీలో చేరితే, చేరిన మూడు నెలల్లోనే ఆయనను కిడ్నాప్ చేసి ప్రజాశాంతి పార్టీలో కొనసాగుండా చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. కులాలు, మతాలకు అతీతంగా తాను పార్టీ పెట్టాననే రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల వారికి అధికారం తీసుకువచ్చేందుకు అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు.
.Also Read..
పార్టీలో చేరికలపై ‘నో’ ఇన్టిమేషన్.. రేవంత్‌పై ఉత్తమ్ సీరియస్